Pawan Kalyan : కొండగట్టు అంజనేయ స్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి జనసేన అధినేత నోరు విప్పారు.
ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ .. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు పొత్తుల గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం అని.. ఒక వేళ ఎన్నికలు ఒక వారంలో జరుగుతాయంటే వాటి గురించి స్పష్ట ఇవ్వొచ్చని.. ఇప్పుడు చెప్పడం అంటే కష్టం అని అన్నారు.
అదే విధంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నాం.. బీజేపీ తమను కాదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు.
అది కుదరకపోతే కొత్త పొత్తుల గురించి ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
కాగా అంతకు ముందు కొండగట్టు ఆలయంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారాహి వాహనానికి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి.. తోరణాలతో అలంకరించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలను పూర్తి చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం పవన్ కొండగట్టు పర్యటన మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతుంది.
కొండగట్టుకు భారీ ఎత్తున చేరుకున్న పవన్ (Pawan Kalyan) అభిమానులు..
ఉదయాన్నే 8 గంటల సమయంలో పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు.
11 గంటల సమయానికి ఆలయానికి చేరుకోవాల్సిన పవన్.. అభిమానులు, ట్రాఫిక్ కారణంగా కొంచెం ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
మరలా సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు చేస్తారు.
నేడు ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్ర గా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభం కానుంది.
ధర్మపురి సందర్శన అనంతరం సాయంత్రం 5.30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
(Chalo Kondagattu)కొండగట్టులో మొదటి పూజకు కారణం అదే..
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి పవన్ కళ్యాణ్ ప్రమాదానికి గురి అయ్యారు.
కాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.
అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని తెలిపారు.
అందుకే రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
నేడు జీవో 1 గురించి హైకోర్టులో విచారణ..
ఇటీవలే హైకోర్టు జీవో 1 ని సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో వైకాపా సర్కారుకి ఊహించని షాక్ తగిలింది.
కాగా అందుకు బదులుగా జగన్ సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టులో దీని గురించి విచారణ ఉన్నందున ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోలేము అని వెల్లడించడంతో వైకాపా నేతలు కంటి మీద కునుకు లేకుండా ఎం చేయాలో అని ఆలోచిస్తున్నారు.
నేడు హైకోర్టు లో జీవో 1 గురించి విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/