Site icon Prime9

Varun – Lavanya Marriage : వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీల పెళ్లి కోసం.. భార్యతో కలిసి ఇటలీకి పవన్ కళ్యాణ్

pawan kalyan going to Italy with wife for varun - lavanya marriage

pawan kalyan going to Italy with wife for varun - lavanya marriage

Varun – Lavanya Marriage : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలకు, రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఒక వైపు సినిమాలు.. మరోవైపు పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉంటున్న పవన్ .. ఇప్పుడు తన టైమ్ ని ఫ్యామిలీకి కేటాయించినట్లు కనబడుతుంది. తన భార్య అన్నా లేజీనోవాతో కలిసి ఇటలీకి బయల్దేరారు పవన్. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే పవన్ ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తుంది.

ఇటలీలోని టుస్కానీ నగరంలో నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వరుణ్ – లావణ్యల వివాహం జరగనుంది. ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకుంటారని తెలుస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్.. వీరి పెళ్ళికి హాజరవుతారా ? లేదా? అనే సందేహం నెలకొంది. అయితే ఈ సందేహాలను బ్రేక్ చేస్తూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం అవ్వడం మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది.

 

 

మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్  గ్రాండ్ గా జరిగాయి. ముందుగా ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరవ్వగా.. అల్లు అర్జున్ మిస్ అయ్యారు. ఆ తర్వాత అల్లు వారింట మరోసారి సెలబ్రేషన్స్ జరగగా అప్పుడు పలువురు మిస్ అయ్యారు. 2017లో మిస్టర్ చిత్రం సెట్స్‌లో తొలిసారిగా ఈ జంట కలుసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి నటించారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడిందని.. అప్పటి నుంచి సినీవర్గాల్లో వీరి ప్రేమ విషయంపై గుసగుసలు మెుదలయ్యాయి. దీంతో సోషల్‌ మీడియాలో సైతం వీరి ప్రేమ పుకార్లు వెల్లువలా వచ్చేవి. ఇక ఎట్టకేలకు వరుణ్‌, లావణ్య పెళ్లి పీటలు ఎక్కనుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.

Exit mobile version