Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 12వ తేదీన) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి తమన్ సంగీత అందించారు.
నాన్నలా డైలాగ్స్ చెప్పేవారే లేరు..
కాగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం నందమూరి కుటుంబం వారి సెంటిమెంట్ థియేటర్ అయిన హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో సందడి చేశారు. అభిమానులతో కలిసి వీరసింహారెడ్డి మూవీని బాలకృష్ణ కూతురు నారా బ్రహ్మని వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని.. డైలాగ్స్ చాలా బాగున్నాయని బ్రాహ్మణి తెలిపారు. నాన్నలా డైలాగ్లు చెప్పేవారు దేశంలోనే లేరని ఆమె స్పష్టం చేశారు. ప్రేక్షుకుల మధ్య సినిమా చూడటం తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు.
నాన్న సినిమాలకు అభిమానుల చేసే హంగామా మామూలుగా ఉండదనే అందంతా చూస్తూ వారి మధ్యే ఉండి నాన్న సినిమా చూస్తే ఆ మజానే వేరని ఆమె తెలిపారు. నా పిల్లలను తీసుకోనివచ్చి మరోసారి థియేటర్ లో సినిమా చూస్తానని బ్రాహ్మని అన్నారు. అలాగే నందమూరి-నారా అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చదవండి:
బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్
థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/