Site icon Prime9

Nandamuri Balakrishna: రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం- బాలకృష్ణ

nandamuri balakrishna apologies to nurses about unstoppable issue

nandamuri balakrishna apologies to nurses about unstoppable issue

Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

గత కొంతకాలంగా బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ ‘దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి.. వారి నాయకుడు రావణాసురుడు’ అని కామెంట్ చేశాడు.

ఈ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.

అది జరిగిన కొద్ది రోజులకే.. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడటం వివాదానికి దారితీసింది.

ఏఎన్నార్‌ని అవమానించిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. ఏఎన్నార్‌ను అవమాన పరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

ఆ వివరణ ఇచ్చే క్రమంలోనే అక్కినేని వారసుల కంటే నా మీదే ఎక్కువ ప్రేమ.. అక్కడ లేదు గుర్తు పెట్టుకోండి అని వ్యాఖ్యానించడం కూడా పెద్ద దుమారాన్నే రేపింది.

అయితే తాజాగా బాలయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు.

నా మాటల్ని వక్రీకరించారు : బాలకృష్ణ (Nandamuri Balakrishna)

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టా‌పబుల్ షోకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చారు.

అయితే ఎపిసోడ్‌లో బాలకృష్ణ తమను అవమానించేలా మాట్లాడారని కొందరు నర్సులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

 

 

అన్ స్టాపబుల్ షో లో బాలయ్య మాట్లాడుతూ.. తనకి యాక్సిడెంట్ అయిన క్రమంలో హాస్పిటల్ కి తీసుకెళ్లగా దా** నర్సు భలే ఉంది అంటూ అన్నారు.

గత రెండు రోజులుగా ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దీంతో ఇప్పుడు బాలయ్య వివరణ ఇవ్వడంతో సర్దుమనిగినట్లు అనుకుంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ క్షమాపణలు చెప్పడం కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version