Prime9

Renu Desai Comments : పవన్ కళ్యాణ్ కే నా సపోర్ట్ ..రేణూ దేశాయ్

Renu Desai Comments : జనసేనాని పవన్‌కల్యాణ్‌‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల గురించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు. తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.

పవన్ కు డబ్బుపై ఆసక్తి లేదు..(Renu Desai Comments)

పవన్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని రేణూ దేశాయ్ అన్నారు. తనకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తని. ఆయన మనీ మైండెడ్‌ కాదని. డబ్బుపై ఆసక్తి లేదని రేణూ దేశాయ్ వివరించారు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు. ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటాని రేణూ దేశాయ్ చెప్పారు. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించాలని ఆమె కోరారు.

మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలి..

ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండని రేణూ దేశాయ్ కోరారు. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండన్న రేణూ దేశాయ్, మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపాలని విజ్ఞప్తి చేశారు. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను కూడా ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే అని రేణూ దేశాయ్ కోరారు.

 

Exit mobile version
Skip to toolbar