Waltair Veerayya Trailer : గత కొన్ని రోజులుగా మెగాస్టార్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ ని ఊరమాస్ క్యారెక్టర్ లో చూడాలని అనుకుంటున్నా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. వాల్తేరు వీరయ్య గా చిరంజీవి దుమ్ము లేపేశారు. రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు… నా పేరుకే రికార్డులు ఉంటే అనే మాటని మరోసారి నిజం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. కొంతసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో మెగాస్టార్ మార్క్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, కామెడీ, మాస్ స్టెప్పులుతో ఫుల్ మీల్స్ అందించారు. ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ పాత్ర ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా ‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ను చూసి.. వాడు నా ఎర, నువ్వే నా సొర.. రికార్డులో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అనే డైలాగులు ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా వింటేజ్ చిరుని గుర్తుచేసేలా ఆ స్వాగ్, ఆ స్టైల్ ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు.
మాస్ రాజా రవితేజ పాత్రను కూడా సూపర్ గా డిజైన్ చేశారు. వేటగాడు లేక ఇక్కడ ఒక పులి పూనకంతో ఊగిపోతుందట.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా ట్రైలర్ చివరలో చిరంజీవి ఆల్‌టైమ్ డైలాగ్ ని ‘‘కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి’’ అంటూ రవితేజ చెప్పడం… అందుకలు కౌంటర్ గా ‘‘సిటీకి ఎంతో మంది కమీషినర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్’’ అని చిరు చెప్పడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ అంతా ఈ ట్రైలర్ తో ఫుల్ ఖుషి అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాలో కేథరిన్, బాబీ సింహా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. మెగాస్టార్ సినిమాకి పోటీగా బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీ కూడా రిలీజ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి…
Waltair veerayya Trailer : సోషల్ మీడియాను ఊపేస్తున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మానియా..
Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోషిత్ శెట్టికి ప్రమాదం.. కామినేనిలో సర్జరీ
Joshimath: కుంగిపోతున్న నగరం.. భయం భయంగా ప్రజలు.. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందంటే..?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/