Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ హిట్ సాధించింది.
బాబీ దర్శకత్వంలో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ హిట్ ని అందుకుంది.
ఇక ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా అదరగొట్టారు.
సినిమా చూసిన వారంతా వింటేజ్ చిరంజీవిని గుర్తు చేశారంటూ సంబరపడిపోతున్నారు.
అయితే తాజాగా సుమ యాంకరింగ్ చేస్తున్న “సుమ అడ్డా” అనే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షోలో చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ముఖ్యంగా ఆయన తండ్రి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకోవడం గమనార్హం.
తండ్రి గురించి చిరంజీవి ఏం అన్నారంటే..
ఈ షోలో చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు.
ఎపిసోడ్ ఆద్యంతం చిరంజీవి కూడా అందర్నీ సరదాగా తన స్టైల్ పంచులతో, టైమింగ్ తో నవ్వించారు.
ఇక ఈ మేరకు మీ పిల్లలు చిన్నప్పుడు మీరు షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేకపోయాను అని గతంలో చెప్పారు.
మరి మీ నాన్న గారితో ఎలా ఉండేవారు అని సుమా ప్రశ్నించింది.
అందుకు బదులుగా చిరంజీవి మాట్లాడుతూ.. మా నాన్నని కూడా సినిమా షూటింగ్స్ బిజీ వల్ల చాలా మిస్ అయ్యాను.
ఆయనతో గడిపిన టైం తక్కువ. ఆయన దూరం అయ్యాక చాలా మిస్ అవుతున్నాను.
ఆయన తిరిగి వస్తే ఇప్పుడు మాత్రం ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను.
ప్రజెంట్ జనరేషన్ కి కూడా నేను ఒకటే చెప్తున్నాను .. వాళ్ళు దూరమయ్యాక బాధపడటం కంటే ఇప్పుడే ఎంత బిజీగా ఉన్నా మీ తల్లి తండ్రులతో సమయం గడపండి. వాళ్ళతో గడిపిన సమయమే ఆ తర్వాత మనకి జ్ఞాపకాలుగా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చిరు ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వనిది ఎవరంటే..?
మరోవైపు సుమ గురించి మరో విషయాన్ని బయటపెట్టారు చిరు.
సుమ పుట్టిన రోజు అని తెలిసి వరుసగా మూడేళ్లు బర్త్ డే విషెష్ చెప్పాను. కానీ నాకు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు.
అసలు చిరంజీవి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని ఒకేఒక పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది సుమనే అని అన్నారు.
ఆ తర్వాత ఒకసారి కాల్ చేసి విషెష్ చెప్పాను, అప్పుడు నా నంబర్ సేవ్ చేసుకుంది అని తెలిపారు.
ఇందుకు సుమ సమాధానం చెప్తూ.. సర్ మీకు అప్పుడే చెప్పాను, అసలు చిరంజీవి గారు నాకు మెసేజ్ చేయడమేంటి, నాకు బర్త్ డే విషెష్ చెప్పడమేంటి అనుకోని, అదెవరో చేశారనుకొని వదిలేశాను సర్. ఆ తర్వాత మీరు కాల్ చేశాక మీరనుకోలేదు అని సారీ కూడా చెప్పాను అని చెప్పింది.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా కొనసాగుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/