Site icon Prime9

Ram Charan : ఊరించి ఉసూరుమనిపించిన చరణ్.. బాలీవుడ్ మూవీ కాదు ! సిరీస్ కాదు !!

mega power star ram charan meeshow ad details

mega power star ram charan meeshow ad details

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న చరణ్ బాలీవుడ్ లో కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వాటిని నిజం చేస్తూ ఇటీవలే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో పాటు దీపికా పదుకునే, త్రిష లతో పాటు ఓ వీడియోలో కనిపించారు.

దాంతో అంతా చరణ్ Ram Charan బాలీవుడ్ లో మూవీకి మరోసారి రెడీ అయ్యాడు అని భావించారు. అయితే తాజాగా అందుకు సంబంధించిన పూర్తి వీడియోని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.  ఆ వీడియో ఏ సినిమాకి, ఏ వెబ్ సిరీస్ కి కాదు అని తేలిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారిన ఆ వీడియో అసలు దేనికి సంబంధించిందో మీకోసం ప్రత్యేకంగా..

ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసిన ఆ వీడియో చివరికి.. మీషో యాడ్ కి సంబంధించినది అని అర్ధం అవుతుంది. ఇటీవ‌ల కాలంలో బ‌డా కంపెనీలు యాడ్స్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. సెల‌బ్రెటీల‌తో యాడ్స్ చేయిస్తే త‌మ ఉత్ప‌త్తులు ఎక్కువ మంది వినియోగ‌దారుల‌కు చేరుకుంటాయ‌ని భావిస్తున్నాయి. దీంతో ఎంత ఖ‌ర్చు అయినా స‌రే స్టార్స్ తో యాడ్స్ చేయించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఒక్కో బాష‌లో ఒక్కో స్టార్స్‌తో త‌మ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేయిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మీషో యాడ్ లో తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించగా హిందీలో ఇదే యాడ్‌లో ర‌ణ్‌వీర్ చేశాడు. యాడ్ ప్రారంభం కాగానే.. స‌ర్ టార్గెట్ ను చూశాను అని రామ్‌ చ‌ర‌ణ్ అన‌గా వేరే ప్ర‌దేశంలో ఉన్న వ్య‌క్తి.. ఏజెంట్ అత‌ను ఏం వేసుకున్నాడు అని అడుగుతాడు. అత‌డిని ఫాలో అవుతూ.. బ్లూ జీన్స్ బ్లాక్ జాకెట్.. జాకెట్ ప్రీమియంగా ఉంది. సాఫ్ట్, కోజీగా ఉంది. అత‌డికి బాగా సూట్ అయ్యింది. అబ్బాయి కొంచెం సెక్సీగా ఉన్నాడు స‌ర్‌ అంటూ చ‌ర‌ణ్ అన్నాడు. ఫోక‌స్ చేయ్ జీన్స్ గురించి చెప్ప‌మ‌ని అడుగ‌గానే దానికి సంబంధించిన విష‌యాల‌ను చెబుతాడు. ధ‌ర ఎంతో తెలుసుకుని అడుగ‌గా.. అత‌డి ప‌ట్టుకుని ఎంత‌కు తీసుకున్నావ్ ఈ జాకెట్‌ను రూ.6వేల‌కా అని అడుగుతాడు. కాదు రూ.600 వంద‌ల‌కు అని అత‌డు చెబుతాడు. ఎక్క‌డి నుంచి అడుగ‌గా మీ షో నుంచి అని చెబుతాడు. మొత్తానికి ఈ యాడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.

Exit mobile version