Unstoppable 2 : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది.
మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు.
అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు.
బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా.
ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది.
ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు.
తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.
క్రిష్ ప్రశ్నకు బాలయ్య ఎపిక్ రిప్లై.. దెబ్బకు దిమ్మతిరగాల్సిందే (Unstoppable 2)..
ఈ సంధర్భంగా ఈ ఎపిసోడ్ లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా పాల్గొన్నారు. బాలయ్య – పవన్ తో కలిసి ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఈ మేరకు వారితో సరదాగా ఒక గేమ్ ఆడిన క్రిష్ పవన్, బాలకృష్ణ లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఈ మేరకు డైరెక్టర్ క్రిష్ ఇద్దరి హీరోలని ప్రశ్నిస్తూ.. మీరెప్పుడైనా నచ్చకపోయినా డైరెక్టర్ చెప్పింది చేశారా అని అడగగా.. ఇద్దరు ఔను అని చెప్పారు. తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ ఇప్పుడు పెట్టి ఉంటే సోషల్ మీడియాలో మాములుగా ట్రోల్ చేయరు అని బాలకృష్ణ తెలిపారు.
అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి బతికిపోయాం అని అన్నారు. దీంతో మరోసారి బాలయ్య తొడ కొడితే ట్రైన్ వెళ్లిపోయే సీన్ వైరల్ గా మారింది. అలానే ఎప్పుడైనా ఫుల్ బాటిల్ తాగారా అని క్రిష్ ప్రశ్నించగా బాలయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి క్రిష్ వైపే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సరదాగా డైరెక్టర్ కదా అని పిలిస్తే మనల్ని బ్యాడ్ బాయ్స్ చేస్తున్నారు.. ఇప్పుడు నేను సమాధానం చెబితే తరోల్స్ చేయడానికే కదా అని సరదాగా అన్నారు.
హాఫ్ తాగితే ఒక స్టెప్.. ఫుల్ తాగితే రెండు స్టెప్ లు ముందుకు వేయాలని క్రిష్ కోరగా.. బాలకృష్ణ 4 అడుగులు ముందుకు వేస్తానని ఎపిక్ రిప్లయ్ ఇచ్చి అందరికి మరో షాక్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఫుల్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.
పవన్ – బాలయ్య ఎపిసోడ్ (Unstoppable 2) తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్‌డమ్ పాలిటిక్స్‌లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. ఎన్. టి. రామారావు, ఎంజీఆర్ గారి విషయంలో అది జరిగింది. అందరికీ అలానే అవుతుందని లేదు. ఆ స్పష్టత నాకుంది. రాం మనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు పాలిటిక్స్ నేర్చుకోవాలనుంది అంటూ మాట్లాడారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/