Kiara-Sidharth Wedding : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం.
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
వీరి వివాహ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తుంది.
కరణ్ జోహార్, అశ్విని యార్డి, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని, షాహిద్ కపూర్ దంపతులు, మరి కొంతమంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు అయినట్లు తెలుస్తోంది.
అయితే వీరి పెళ్లి సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ ఇంకా బయటకు రాలేదు.
అయితే వీరి పెళ్లి తంతుకు హాజరయ్యేందుకు వెళ్లిన పలువురు బాలీవుడ్ సినీ నటీనటులు కియార-సిద్ధార్థ్ వెడ్డింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కాగా కొంతకాలంగా వీరిద్దరు ప్రేమ ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే వీర్దిదరూ ఎప్పుడూ తమ డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. తామిద్దరం స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్న ఈ జంట పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచింది.
వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
పెళ్లి వేడుక జైసల్మేర్ లో జరగనుండగా, ముంబైలో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం సిద్ధార్థ్, కియారా గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని సమాచారం అందుతుంది.
(Kiara-Sidharth Wedding)పెళ్లి సీక్రెట్ రివీల్ చేసిన వికీపీడియా..
నటి ప్రీతి జింటా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ వైబ్స్ అంటూ సోమవారం తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
అలానే ఈక్రమంలో వీరి పెళ్ళిని ద్రువపరిచింది గూగుల్.
కియారా అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రా భార్య భర్తలు అయినట్టుగా.. వికీపీడియా గుర్తించింది.
ఈ ఇద్దరి స్టార్స్ ప్రోఫైల్ కాలమ్ లో Spouse కాలమ్ ను ఆడ్ చేశారు. ఇద్దరు తారల ప్రోఫైల్ లో జీవిత భాగస్వామి లైన్ చేరింది.
కియారా జీవిత భాగస్వామిగా సిద్థార్థ్ .. సిద్థార్ధ్ జీవిత భాగస్వామిగా కియారా అద్వాని పేరును వికీపీడియా అఫీషియల్ గా యాడ్ చేసింది.
దీంతో వీరు తమ పెళ్ళిని ఎప్పుడు ధ్రువీకరిస్తారో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అనంతరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయ్యింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/