Site icon Prime9

Kiara – Sidharth Wedding : పర్మినెంట్ బుకింగ్ అయిపోయిందంటున్న కియారా – సిద్ధార్థ్.. వైరల్ గా పెళ్లి ఫోటోలు

kiara-and-sidharth-marriage-photos-goes-viral

kiara-and-sidharth-marriage-photos-goes-viral

Kiara – Sidharth Wedding : బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.

రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ వివాహ వేడుకను చాలా సీక్రెట్ గా పూర్తి చేశారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.

వీరి పెళ్లికి కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్, ఇషా అంబానీ, పలువురు ప్రముఖులు హాజరాయినట్లు సమాచారం అందుతుంది.

 

పర్మినెంట్ గా బుక్ అయ్యాం.. ఆశీర్వాదాలు కావాలంటున్న కియారా – సిద్ధార్థ్ జంట..

 

ఈ పెళ్లి వేడుకను చాలా సీక్రెట్ గా కానిచ్చేసిన ఈ జంట పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవి బయటికి రాకుండా జాగ్రత్త తీసుకున్నారు.

ఈ తరుణంలోనే వీరి ఫ్యాన్స్ అంతా ఒకింత నిరాశకు కూడా గురయ్యారు.

అయితే ఎట్టకేలకు ఈ జంట సోషల్ మీడియా వేదికగా వారి పెళ్లి ఫోటోలను పోస్ట్ చేస్తూ..  “ఇప్పుడు మేము శాశ్వతంగా బుక్ అయ్యాం.. మా కొత్త ప్రయాణానికి మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు అందించండి” అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ గా మారాయి.

పెళ్లి కూతురుగా కియారా లుక్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది.

పెళ్లి వేడుకలో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణం లెహంగాలో తళతళ మెరిసిపోయారు.

ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా గ్రీన్ జ్యూయలరీలో కియారా అందరినీ ఆకర్షిస్తుంది.

ఇక  సిద్ధార్థ్ ఐవరీ షేర్వాణీ ధరించారు.

ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

 

‘షేర్షా’ సినిమాలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు జంటగా నటించారు. సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది.

ఆ తర్వాత .. ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా సార్లు సందడి చేయడం. ఇద్దరూ కలిసి పలు ఇవెంట్స్ కలిసి హాజరు కావడంతో వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే వీరిద్దరితోపాటు.. సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఈ జంట పెళ్లి గురించి స్పంధించకపోవడం కూడా గమనార్హం.

మొత్తానికి ఈ ప్రేమ జంట.. ఫిబ్రవరి 7న పెళ్లిబంధంతో అధికారికంగా ఇద్దరూ ఒక్కటయ్యారు.

కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుకలు ఈనెల 4వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.

సోమవారం నాడు మెహందీ, సంగీత్ ఏర్పాటు చేశారు. అంతకుముందు గెస్టులకు వెల్‌కమ్ లంచ్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గ్రాండ్ గా సంగీత్ నైట్ నిర్వహించినట్టు సమాచారం.

త్వరలోనే ముంబైలో తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం సిద్ధార్థ్, కియారా గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

 

కియారా అద్వానీ మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించారు.

ప్రస్తుతం ఆమె తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన ప్రాజెక్టు ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం.. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version