Kanna Lakshminarayana : మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా సమర్పించారు. గురువారం నాడు తన నివాసంలో స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. ఆ కార్యకర్తల సమావేశంలో బీజేపీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారని తెలుస్తుంది. కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే కన్నా ఈ నెల 24న టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వారిద్దరితో విభేదాలే రాజీనామాకి కారణమా(Kanna Lakshminarayana)..?
కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు కూడా కన్నా బాటలోనే పయనించారు. ఏపీ బీజేపీలో ఇద్దరు బీజేపీ నేతల మధ్య కాపు రిజర్వేషన్లు, వంగవీటి రంగా విషయంలో మాటకు మాట నడుస్తోంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌కు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నాకు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. కాపు రిజర్వేషన్ల అంశాన్ని, జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌ను ఈ మధ్య గట్టిగా వినిపిస్తున్నారు జీవీఎల్. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కన్నా. జీవీఎల్ కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. EWS పది శాతం కోటాలో కాపులకు ఐదు శాతం అమలుపైనా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ స్టాండ్ ఏంటో చెప్పకుండా రాజ్యసభలో ప్రశ్న వేసి సమాధానం చెప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కన్నా.
అటు పార్టీ ప్రెసిడెంట్… సోము వీర్రాజుతోను కన్నాకు గ్యాప్ ఉంది. దీంతో అంతర్గత విబేధాలతో కొనసాగలేక.. పార్టీని కన్నా వీడారని సమాచారం అందుతుంది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి ఆకర్షితుడిని అయ్యానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తన పనిని గుర్తించి 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారని.. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని, మోదీ నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశానని తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నామన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడామని అన్నారు. మోదీ అంటే జీవితకాల అభిమానం ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేకపోయానని వెల్లడించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/