Site icon Prime9

Janasena : రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటున్న పవన్ కళ్యాణ్

janasenani pawan kalyan released yuvasakthi poster

janasenani pawan kalyan released yuvasakthi poster

Janasena : ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్‌ నింపుతున్నారు.  ఇప్పటికే ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో నూతన ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు.

ఈ మేరకు తాజాగా  “యువశక్తి” కార్యక్రమానికి నాంది పలికారు. రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో… స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన నింపిన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదే విధంగా ఆ ప్రెస్ నోట్ లో… అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో “యువశక్తి” కార్యక్రమం నిర్వహించనుందని పిలుపునిచ్చారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా వైఫల్యాన్ని ఎండగట్టేలా యువత అంతా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రధాన బలమైన యువత కోసం ఈ కార్యక్రమం చేస్తుండడంతో రాష్ట్ర ప్రజలంతా దీనిపై దృష్టిసారిస్తున్నారు.

Exit mobile version