Site icon Prime9

Pawan Kalyan : హరిరామ జోగయ్యకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్… ఏమన్నారంటే?

pawan kalyan comments on harirama jogaiah

pawan kalyan comments on harirama jogaiah

Pawan Kalyan : మాజీ మంత్రి హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నట్టుగా ప్రకటించిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఆదివారం అర్దరాత్రి బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమం లోనే హరిరామ జోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు. కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ఆయనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు.

85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని పవన్‌ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన యూట్యూబ్ వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఈ వయస్సులో అంత మొండి పట్టు పట్టడం పట్ల బాధపడ్డారు. ప్రజల కోసం ఈ వయస్సులో కూడా అన్నం తినకుండా … ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా దీక్ష చేయడాన్ని ఆయన గొప్పతనంగా అభివర్ణించారు. కనీసం టాబ్లెట్స్ అయిన వేసుకోవాలని… వెంటనే ఆ దీక్షను విరమించాలని కోరారు. వైద్యులతో కూడా మాట్లాడి హరి రామ జోగయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం అందుతుంది.

అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన విరమించుకోవాలని పోలీసులు సూచించారు. జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పాలకొల్లులో జోగయ్య ను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిరామ జోగేయకు పవన్ ఫోన్ చేసి మాట్లాడడం… ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Exit mobile version