Site icon Prime9

Adibhatla Kidnap Case: నవీన్ రెడ్డితో పెళ్లి జరగలేదు… నన్ను దారుణంగా హింసించారు- డాక్టర్ వైశాలి

vaishali

vaishali

Adibhatla Kidnap Case: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. తనకు నవీన్ రెడ్డితో పెళ్లి జరగలేదని.. తన కెరీర్ నాశనం చేశాడని వైశాలి మీడియాకు తెలిపారు. తనను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లాక.. జుట్టు పట్టి కొట్టాడని, మెడపై దాడి చేసి గాయపరిచాడని యువతి ఆవేదన వ్యక్తం చేసారు. మెడ మెలి తిప్పి హింసించాడని, కాళ్లు కూడా మెలితిప్పి తీవ్రంగా హింసించారని వాపోయారు. కారులో పదిమంది ఉన్నారని దారుణంగా ప్రవర్తించారని తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని తెలిపారు.లాక్‌డౌన్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ నవీన్ రెడ్డితో పరిచయమైందన్నారు డాక్టర్ వైశాలి.

పెళ్లికి, ప్రేమకు అంగీకరించలేదని రోజూ తన ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేసేవాడని వైశాలి తెలిపారు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశానని.. పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదన్నారు.తాను ఒంటరిగా నవీన్ రెడ్డితో ఎప్పుడూ వెళ్లలేదని, తన కుటుంబంతో పాటు కొన్నిసార్లు టూర్లకు వెళ్లినట్లు తెలిపింది. తన కుమారుడ్ని కాపాడుకునేందుకు నవీన్ రెడ్డి తల్లి సైతం ఆరోపణలు చేసినట్లు బాధితురాలు అన్నారు. నీ లైఫ్ నువ్వు చూసుకో, మా లైఫ్ మేం చూసుకుంటాం అని చెప్పినా నవీన్ రెడ్డి వినలేదని, ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసారు.పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్‌మెంట్‌లో వున్నానని వైశాలి రెడ్డి చెప్పారు. తనకు సెక్యూరిటీ కావాలని, నవీన్ ముఠాను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసారు.

Exit mobile version