Site icon Prime9

Janasena Pawankalyan: జనసేనాని రాకతో జనసముద్రంగా బెజవాడ.. సీఎం సీఎం అంటూ మారుమోగిన నినాదాలు

huge crowd gathered in vijayawada to see janasena pawankalyan

huge crowd gathered in vijayawada to see janasena pawankalyan

Janasena Pawankalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ మేరకు తన ప్రచార రధం వారాహికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మొదట మంగళవారం నాడు కొండగట్టు లోని అంజన్న సన్నిధిలో పూజ కార్యక్రమాలు నిర్వహించిన పవన్.. నేడు విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు  మరోమారు పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.

ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అంతరాలయం ద్వారా అమ్మవారిని దర్శించుకున్న పవన్‌ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు జనసేనానికి ఆశీర్వచనం అందజేశారు.

‘దుర్గాదేవి ని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్లలో తల్లి నుంచి పిలుపురాలేదు.

ఇవాళ తల్లి దుర్గమ్మ పిలిపించుకొని ఆశీస్సులు అందజేసింది.

నిన్న కొండగట్టులో వారాహి పూజను నిర్వహించాం.

ఇవాళ దుర్గమ్మ చెంత వారాహికి పూజలు నిర్వహిస్తున్నాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

అలానే గుడిలో రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.

బయటికి వచ్చిన తర్వాత వారాహి నుంచి వాటి గురించి మాట్లాడతా అని తెలిపారు.

 

పవన్‌ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైనా కిందా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.

మరోవైపు జనసేన వీర మహిళలు 108 బిందెలలో పసుపు, కుంకుమ కలిపిన నీళ్ళతో వారాహికి పూజ చేశారు.

అనంతరం పవన్ వారాహి పైకి ఎక్కి మాట్లాడారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.

పవన్ (Janasena Pawankalyan) కోసం జనసంద్రంగా బెజవాడ..

అయితే పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తున్నారని ముందే ప్రకటించడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అడుగడుగున పవన్ కు నీరాజనాలు పలుకుతూ బెజవాడ రోడ్లన్నీ జనసముద్రాన్ని తలపించాయి.

భారీ క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్ కి గజమాలలు వేశారు.

దీంతో బస్టాండ్ కి వెళ్ళే దారి జనమయం అయిపోయింది. ఫై ఓవర్ మీద నుంచి వెళ్ళేవారు, కింద రోడ్డు మీద వెళ్ళేవారు పవన్ కళ్యాణ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ముఖ్యంగా సీఎం సీఎం అంటూ యువకులు, జనసైనికులు బెజవాడ మొత్తం దద్దరిల్లే రేంజ్ లో నినాదాలు చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version