Nagababu In Kurnool: జనసేన అధికారంలోకి రాగానే సుగాలీ ప్రీతి కేసుపై ప్రత్యకే దృష్టి పెడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారు అన్నారు.
కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో నాగబాబు సుదీర్ఘంగా చర్చించారు.
తాము అధికారంలో రాగానే.. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కర్నూలులో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. Nagababu ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు నాగబాబుకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని వైసీపీపై విమర్శలు చేశారు. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసిన కూడా.. జగన్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.
కర్నూలు చెందిన సుగాలి ప్రీతి 2017లో హత్యకు గురైంది.
కానీ బాలిక చదువుతున్న పాఠశాల యాజమాన్యం మాత్రం నిజాన్ని దాచిపెట్టింది.
బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్కూల్ యాజమాన్యం పేర్కొంది.
దీనిపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగింది.
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని వాదించిన బాలిక తల్లిదండ్రులు.
బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
పోస్టుమార్టం నివేదికలో బాలికను రేప్ చేసినట్లు నిర్ధారణలో తేలింది.
అయితే ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని నాగబాబు అన్నారు.
నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతున్నారని.. అలాంటి మానవ మృగాలకు సరైన శిక్ష పడాలని అన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నాగబాబు హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
ఈ మేరకు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని విమర్శించిన నాగబాబు.
దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/