Site icon Prime9

Hyderabad Sea: హైదరాబాద్​లో సముద్రం.. ఎక్కడో తెలుసా ?

hyderabad sea

hyderabad sea

Hyderabad Sea: హైదరాబాద్ కు సముద్రం రానుంది. హైదరాబాద్ లో సముద్రం ఏంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే కాని.. నిజమైన సముద్రం కాదు. సినిమా కోసం సముద్రం తరహా సెట్ వేస్తున్నారు. మరి ఇది ఎక్కడో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.

తారక్ నటించబోయే ఓ చిత్రంలో సముద్రం తరహా సెట్ వేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. దీంతో తారక్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ భారీ విజయం తర్వాత.. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం. ఎన్టీఆర్ 30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ.. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ కొత్త ఏడాదినే ఎన్టీఆర్ తన అభిమానులకు అప్ డేట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా 2024లో ఉగాది కానుకగా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తుంది.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా

ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. ఈ కథ.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.

దీనికోసం హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ తయారు చేస్తున్నారు. సముద్రం సెట్ తీర్చిదిద్దేపనిలో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఉన్నారు.

ఈ సెట్ సహజత్వం ఉట్టిపడేలా చిత్రబృందం ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

ఈ సెట్ లోనే సాబు సిరిల్ తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఫిబ్రవరి రెండో వారంలో అధికారికంగా ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రారంభానికి.. సినీ తారలు రానున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. తొమ్మిది బాషాల్లో విడుదల కానుంది.

అందుకు తగిన విధంగానే కథను రూపొందించారట దర్శకుడు.

ఇదివరకే ఎన్టీఆర్ NTR -కొరటాల దర్శకత్వంలో జనతా గ్యారేజీ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version