Director Bobby : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో కేఎస్ రవీంద్ర ( బాబీ ) ఒకరు. పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్న ఈ డైరెక్టర్ … ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్షన్ చేసిన బాబీ ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయం అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఈ నెల 13న రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
చాలా కాలం తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతుండడంతో మెగా అభిమానులు అంతా ఈ చిత్రం కోసం ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు.
అలానే ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటించడం మరో హైలైట్ కానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ లు యూట్యూబ్ ని షేక్ చేసి ఫుల్ ట్రెండింగ్ గా నిలిచాయి.
ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది.
ఈ మేరకు ఈరోజు వైజాగ్ ఏయూ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు.
ఈ తరుణంలోనే మెడియాతో సమావేశం నిర్వహించిన బాబీ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
వాల్తేరు వీరయ్య టైటిల్ కి కారణం ఆయనేనా…
ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడానికి గలా కారణాన్ని బాబీ బయటపెట్టాడు. ఈ ఎమోషనల్ స్టోరీ తెలిశాక టైటిల్ లో ఇంత విషయం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. 2019లో విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాకి బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్ నాజర్ తనకి ఒక బుక్ ఇచ్చాడని చెప్పుకొచ్చిన బాబీ.. ఆ బుక్‌లో వీరయ్య అనే పేరు తనని బాగా ఆకట్టుకుందని గుర్తు చేసుకున్నాడు. అప్పుడే తన టీంతో వీరయ్య పేరుతో మూవీ తీయాలని ఉందని చెప్పారట. అంతే కాకుండా… చిరంజీవి సినిమాల్లోకి రాకముందు బాపట్లలో ఉండేవారు.
చిరంజీవి తండ్రితో పాటు వీరయ్య అనే ఓ హెడ్ కానిస్టేబుల్ పని చేసేవారట. చిరంజీవికి సినిమాల మీద ఉన్న మక్కువను గుర్తించి తన స్వంత డబ్బులు చిరంజీవికి ఇచ్చి ఫొటో షూట్ చేయించుకోమన్నారట. ఆ తర్వాత ఆకక్డి నుంచి చిరంజీవి నట ప్రస్థానం అందరికీ తెలిసిందే. సినిమా కెరీర్ ఆరంభనికి ముందే తనకు ఎంతో సాయపడిన వీరయ్య చిరంజీవి కూడా బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్లు బాబీ చెప్పుకొచ్చాడు. దీంతో ఇక ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ని రిజిస్టర్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి…
Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?
Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” మెగా మాస్ ఈవెంట్ కి లైన్ క్లియర్… ప్లేస్ ఫిక్స్ !
Gudivada Amarnath: బాలయ్య బాబు కాదు తాత- గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/