Site icon Prime9

Bollywood: అర్జున్‌ కపూర్‌తో పెళ్లికి ఓకే చెప్పిన మలైకాఅరోరా.. హాట్‌ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌

did-actress-malaika-arora-confirm-her-marriage-with-arjun-kapoor-in-her-instagram-post goes trending

did-actress-malaika-arora-confirm-her-marriage-with-arjun-kapoor-in-her-instagram-post goes trending

Bollywood: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నటి మలైకా అరోరా, హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్‌ వ్యవహారాలతోనే వీరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బాలీవుడ్‌ నాట గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఇకపోతే రీసెంట్ గా మలైకా చేసిన పోస్ట్ చూస్తే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

తలదించుకుని ముసిముసి నవ్వులు చిందిస్తూ మురిసిపోతున్న తన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నేను ఎస్‌ చెప్పాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీనికి తోడు షమితా శెట్టి, మహివిజ్‌, పుల్‌కిత్ సామ్రాట్‌ వంటి సెలబ్రిటీలు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పడం, హార్ట్‌, లవ్‌ ఎమోజీలు షేర్‌ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఆమె అర్జున్‌ కపూర్‌తో ఏడడుగులు నడువనుందని టాక్‌ వినిపిస్తోంది. ఇదే సమయంలో కొందరు ఏదో బ్రాండ్ యాడ్ కోసం ఇలా చేస్తున్నారంటూ మరికొందరేమో ఆమె చేతికి ఎలాంటి ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌ లేదని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మలైకాతో పెళ్లి గురించి ఇటీవల అర్జున్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. గతంలో కాఫీ విత్‌ కరణ్‌ షోకు హాజరైన అర్జున్‌ మలైకాతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఇప్పుడు మలైకాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేను. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత రెండేళ్లు సినిమాలు చేయలేకపోయానని
తన కెరీర్‌ మీదే పూర్తిగా దృష్టిపెట్టాలని అనుకుంటున్నాని ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేదని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు అర్జున్. ఇలా నెట్టింట ఈ టాపిక్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదీ చదవండి: అవి నన్ను బాధిస్తున్నాయి.. రష్మిక భావోద్వేగ నోట్

Exit mobile version