Site icon Prime9

Covid Cases : నిజంగానే దేశంలో మళ్ళీ లాక్ డౌన్ రానుందా… ఈ కోవిడ్ ఫోర్త్ వేవ్ అంత డేంజరా?

covid cases alert and lock down details in india

covid cases alert and lock down details in india

Covid Cases : కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాటితో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే బీఎఫ్ 7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం… కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. దీంతో పాటు విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

ఈ మేరకు ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఓ ఆడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే, పోస్ట్ వైరల్ కావడంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాజాగా ఓ ఫాక్ట్ చెక్ నిర్వహించింది. అందులో ఆ ప్రకటన తప్పు… కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు అని పేర్కొంది.

ఈ మేరకు ట్విట్టర్ లో… భారతదేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితి ప్రకారం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్‌, అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్ లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే కొన్ని దేశాల్లో కేసుల పెరుగుదల కారణంగా నిఘా, అప్రమత్తత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది అని రాసుకొచ్చారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. డిసెంబర్ 26 నాటికి తెలంగాణలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 65 , ఇంకా రికవరీ రేటు 99.5 . ఈ క్రమంలోనే కరోనా పరీక్షలను ముమ్మరంగా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరగడం లేదు.

 

Exit mobile version