Site icon Prime9

Waltair Veerayya OTT Release : ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య”.. ఎప్పుడంటే?

chiranjeevi waltair veerayya ott release in netflix on february 27

chiranjeevi waltair veerayya ott release in netflix on february 27

Waltair Veerayya OTT Release : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.

ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.

చిరుని వింటేజ్ వెర్షన్ లో చూపించడంలో దర్శకుడు బాబీ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో చూపించడంతో జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్లకు ఎగపడేలా చేసింది.

చిరు ఈ సినిమాతో దాదాపు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు.

 

 

నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరు వాల్తేరు వీరయ్య..

ఇక ఈ సినిమాలో రవితేజ చిరంజీవికి తమ్ముడిగా అదరగొట్టాడు అని చెప్పాలి.

వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని కంటతడి పెట్టించాయి.

ఇక శ్రుతిహాసన్‌ అంద చందాలు, క్యాథరిన్‌ థెరిస్సా అభినయం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి మరో యాడ్ ఆన్ లాగా మారింది.

ఈ సినిమాతో ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్న మెగాస్టార్ కి సూపర్ విక్టరీ దక్కిందని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు అనూహ్య స్పందన వస్తోంది.

ఈ సినిమా చూశాకా 80, 90 దశకాల అభిమానులకి పాత చిరంజీవి గుర్తుకు వస్తున్నారు అని అభిమానులు అంటున్నారు.

సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్దమవుతుంది.

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది.

ఫిబ్రవరి 27న నుంచి ఈ మూవీ ఓటిటిలో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

 

 

ఎవరైనా ఈ మూవీని థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే.. ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

అలాగే చిరు గత మూవీ గాడ్‌ఫాదర్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవ్యవడం విశేషం.

కాగా రిలీజ్ అయిన వారం రోజులు పాటు ఈ మూవీ నెంబర్ వన్ గా ట్రెండ్ అయ్యి .. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ రికార్డు సాధించిన మూవీగా ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో చూడాలి.

 

కాగా చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు.

తమిళ సినిమా ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది.

మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ లేదా దసరాకి రిలీజ్ కానుంది.

ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా నటిస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version