Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ స్టార్ కిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై మెరుపులు మెరిపించడానికి రెడీ అయ్యింది. శాకుంతలం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది ఈ చిన్నారి.
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ క్యారెక్టర్ లో నటిస్తూ..గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా శాకుంతలం.
పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్.
ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు చిన్నప్పటి క్యారెక్టర్ లో అర్హ నటిస్తుంది.
ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అర్హ సింహంపై కూర్చొని రావడంతో.. సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
డబ్బింగ్ చెప్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) కుమార్తె అర్హ..
తాజాగా అర్హ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటోని స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోని అల్లు అర్జున తన స్టోరీలో కూడా షేర్ చేసి తన కూతురు డబ్బింగ్ చెప్తుందని మురిసిపోతున్నాడు.
దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్.
ఇక శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా సమంత ఈసినిమాకు డబ్బింగ్ చెప్పింది.
ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రీసెంట్‌గా 6వ ఏట అడుగుపెట్టిన అర్హ.. ఈ ఫీట్‌తో అభిమానుల దృష్టిని మరింతగా ఆకర్షించింది.
ఇక గతంలో అల్లు అర్జున్ తన కుమార్తె అర్హ నటనపై స్పందించారు. ‘ఆమెను ఆన్‌స్క్రీన్‌లో చూసేంత వరకు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు.
నేను మానిటర్‌లో రషెస్ చూశాను. కానీ మ్యూజిక్, డబ్బింగ్‌తో స్క్రీన్‌పై మొత్తం సినిమా చూసినపుడు ఎలా ఉంటుందో చూడాలి.
కానీ ఈ ఫీలింగ్ ప్రస్తుతానికి చాలా అందంగా ఉంది’ అన్నారు బన్నీ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/