Allu Arjun: ప్రముఖ టాలివుడ్ నటుడు అల్లు అర్జున్ చేసిన ఓ గుప్త దానాన్ని కేరళ అలెప్పీ కలెక్టర్ బయటపెట్టారు. దీంతో అల్లు అర్జున పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే, కేరళలోని అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ ను ఓ పేద విద్యార్ధి కలిసింది. తన తండ్రి కరోనా కాలంలో మృతి చెందారని పేర్కొనింది. ఆ విద్యార్ధిని ఇంటర్ లో 92శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. నర్సింగ్ చేయాలన్న ఆమె తపనను నిజం చేయాలని కలెక్టర్ భావించారు. వెంటనే వుడ్ ఆర్ ఫర్ అలెప్పీ ప్రాజెక్టులో ఆమెకు సీటు ఇప్పేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. కాని అప్పటికే మెరిట్ కోటాలో ధరఖాస్తు చేసుకొనే సమయంలో ముగిసిపోయింది. దీంతో మేనేజ్మెంటు కోటా కోసం ప్రయత్నించారు. కట్టనంలోని సెయింట్ ధామస్ నర్సింగ్ కాలేజీలో ఆ విద్యార్ధినికి సీటు లభించింది. అందుకు ఓ స్పాన్సర్ కావాల్సి వచ్చింది. విషయాన్ని నటుడు అల్లు అర్జున్ కు కలెక్టర్ కృష్ణ తేజ చేరవేశారు. విద్యార్ధిని హాస్టల్ ఫీజుతోసహ అన్నింటినీ ఆయన భరించడంతో ఆమెకు కాలేజీలో సీటు వచ్చింది. జాయిన్ అయిన వెంటనే కలెక్టర్ కాలేజీకి కూడా వెళ్లారు. విద్యార్ధిని బంగారు భవిష్యత్తు కోసం ముందుకొచ్చిన అల్లు అర్జున్, ధామస్ కాలేజీ యాజమాన్యానికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఇప్పటివరకు ఈ విషయాలు గోప్యంగా ఉన్నాయి. తాజాగా కలెక్టర్ కృష్ణతేజ నెట్టింట ఓ పోస్టును చేయడంతో అల్లు అర్జున దాతృత్వ సమాచారం అందరికి తెలిసింది. మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించాల్సిన అవసరం లేదని అని అల్లు అర్జున్ ఓ సినిమాలో చెప్పిన సంభాషణను గర్తు చేసుకుంటున్నారు. అభినందనలు గుప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Govt Jobs: ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు.. ఎన్ఎండీసీలో కొలువులు