Pawan Kalyan OG: యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
డైరెక్టర్ సుజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు. 2014లో విడుదలైన `రన్ రాజా రన్` మూవీతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన.. మళ్లీ ఐదేళ్లకు `సాహో`తో ప్రేక్షకులను పలకరించాడు. `బాహుబలి` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన తదుపరి చిత్రాన్ని సుజిత్ వంటి యంగ్ డైరెక్టర్‌తో అనౌన్స్ చేయడంలో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ కూడా పాన్ ఇండియా మూవీనే. యువి క్రియేషన్స్, , టీ-సిరీస్ బ్యానర్లపై వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ 2019 ఆగస్టు 30న రిలీజ్ అయిన ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.
సాహో చిత్రం తెలుగులో అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయినా బాలీవుడ్‌లో మంచి వసూళ్లను రాబట్టింది.
కాగా సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(Pawan Kalyan OG) అడవి శేష్ ఏమన్నారంటే..
అయితే రీసెంట్ గా హిట్ 2 హిట్ కొట్టిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ పవన్ సుజిత్ కాంబో సినిమా కథ తనకు తెలుసని. ‘‘దాదాపు మూడేళ్ల తర్వాత సుజిత్‌కు సరైన ప్రాజెక్ట్ కుదిరింది. ‘సాహో’ తర్వాత ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ సుజిత్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
కానీ అతను అంగీకరించలేదు. తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు వాళ్లతో చెప్పాడు. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అకీరా ఆనందంగా ఉన్నాడు. సినిమా కోసం తను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు’’ అని అన్నారు.
ఇంతకీ ఓజీ అంటే ఏంటి?
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. చాలామంది గ్యాంగ్‌స్టర్‌లు ఉంటారు. కానీ ఒరిజినల్‌గా ఆ గ్యాంగ్‌ను మొదలు పెట్టింది ఎవరు? అన్నదానిపైనే సాధారణంగా గ్యాంగ్‌లకు పేర్లు ఉంటాయి. ఓజీ పేరుతో
గ్యాంగ్ ఉంది అంటే.. అది చిన్నా చితకా గ్యాంగ్ కాదన్నమాట. ఇక ఆ గ్యాంగ్‌ను ప్రారంభించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గురించి చెప్పాల్సిన పనేముంది. తోపు అయితేనేకదా ఓజీ అయ్యేది.
అలాంటి ఒక ఓజీ కథే ఈ సినిమా. అలాంటి ఓజీగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడంటే.. ఇక నట విశ్వరూపమే.
పైగా, ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఇందులో గన్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా ఇష్టంగా నటించే అవకాశాలూ ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు. వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/