Site icon Prime9

Actress Ileana : పండంటి బాబుకి జన్మనిచ్చిన గోవా బ్యూటీ ఇలియానా..

actress ileana gave birth to baby boy and photo goes viral on media

actress ileana gave birth to baby boy and photo goes viral on media

Actress Ileana : ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను తల్లిని అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రకటనతో ఆమె అభిమనులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం.. మరి ముఖ్యంగా అందుకు కారణం ఎవరో అని చెప్పకపోవడంతో ఇలియానాపై తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ మంచిగా ఉంటూ వచ్చింది.

ఇటీవల ఒకరితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి డేట్ నైట్ అని రాసి లవ్ సింబల్ వేసింది. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతనే, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కానీ వాటిపై ఇలియానా ఏం స్పందించలేదు. కాగా తాజాగా ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమనులతో పంచుకుంది.

ఈ మేరకు (Actress Ileana) ఇన్ స్టా లో తన బాబు ఫోటోని కూడా పోస్ట్ చేసి.. “కోవా ఫీనిక్స్ డోలన్” అనే పేరు పెట్టినట్టు ప్రకటించింది. అలానే మేము ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చెప్పలేకపోతున్నాను. ఈ ప్రపంచంలోకి నా బాబుకి స్వాగతం అని రాసుకొచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక అలానే బాబు తండ్రి ఎవరో ఇప్పటికైనా అధికారికంగా చెప్పమని కామెంట్స్ చేస్తున్నారు.

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ” ఇలియానా “. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్‍లో దూసుపోయింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఉన్నట్టుండి ఇలియానా బొద్దుగా మారడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్లీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Exit mobile version