Actor Sonusood : లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతో మందికి అన్నీతానై అండగా నిలిచాడు నటుడు సోనూసూద్.
విమానాలు, రైళ్లు, ప్రత్యేక బస్సులు ఇలా ప్రయాణ ఏర్పాట్లు చేసి.. వలస కూలీలను తమ సొంతూళ్లకు చేరుకోవడంలో సోనూ ముఖ్యపాత్ర పోషించాడు.
అంతటితో ఆగకుండా… ట్విట్టర్ వేదికగా సాయం చేయమని తనను వేడుకున్న వారికి ఆర్థికంగా సహాయం చేశాడు.
సాధారణ ప్రజలే కాకుండా పలువురు ప్రముఖులకు కూడా సోనూసూద్ సహాయం చేశారు. అప్పటి నుంచి సోనూసూద్ ని ప్రజలంతా రియల్ హీరోగా అభివర్ణిస్తూ పిలుచుకుంటున్నారు.
కాగా తాజాగా సోనూసూద్‌కి సిద్దిపేట జిల్లాలో ఘన స్వాగతం లభించింది.
కరోనా కష్ట కాలంలో సోనూసూద్ చేసిన సేవలను గుర్తుగా చల్మే తండాలో విగ్రహాం నెలకొల్పారు అక్కడి స్థానికులు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో నటుడు సోనుసూద్ పర్యటించారు.
గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అభిమానులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామైంది. సోనూసూద్‌కు చేర్యాల పెయింటింగ్‌ను బహుకరించారు అభిమానులు.
వారి కోసమే చెల్మి తండాకు సోనుసూద్ (Actor Sonusood)..
కరోనా లాక్‌డౌన్ సమయంలో సోనుసూద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు చెల్మి తండాలో గుడి కట్టారు.
తండా వాసులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు చెల్మి తండాకు సోనుసూద్ వచ్చారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా సహాయం చేయడంతో చెల్మి తండా గ్రామస్తులు, యువకులు సోనుసూద్ పై మరింత అభిమానం పెంచుకున్నారు.
తండా వాసులు సోనుసూద్‌ను దేవుడిగా భావించి..వారి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రెండేళ్ల క్రితం తండాలో తనకు గుడి కట్టారని తెలిసిందని, ఇక్కడకు రావాలని చాలా కోరిక ఉండేదన్నారు సోను.
గ్రామస్తులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానని చెప్పారు.
కరోనా ఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తానన్నారు. చెల్మి తండా వాసులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య సినిమాలో విలన్ గా నటించాడు.
కానీ ఆ చిత్రం ప్రేక్షకలను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
అలాగే తాను రాజకీయాల్లోకి వస్తారని.. పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి.
కానీ తాను రాజకీయలలోకి రావడం లేదని తెలిపారు సోనూ.
ఓ సాధారణ వ్యక్తిగా ఎంతో ఆనందంగా ఉన్నానని వెల్లడించారు.
దీంతో సోనూసూద్ ఇప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వరనే విషయం స్పష్టమైంది.
కాగా ఇటీవల తన సోదరి ఎన్నికల్లో పోటీ చేయగా .. ఆమె తరుపున ప్రచారం నిర్వహించారు సోనూసూద్.
హీరోగా సోనూసూద్ ..
ప్రస్తుతం సోనూ సూద్ హీరోగా నటిస్తూ సినిమాలు కూడా ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే ‘కిసాన్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు సోనూ ప్రకటించాడు కూడా.
ఇదిలా ఉంటే తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/