Site icon Prime9

CEO Vikas Raj: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది.. సీఈవో వికాస్ రాజ్

CEO Vikas Raj

CEO Vikas Raj

CEO Vikas Raj: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని వికాస్ రాజ్ రాజకీయనాయకులకు సూచించారు.

అమల్లో 144 సెక్షన్ ..(CEO Vikas Raj)

పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోవాలని తెలిపారు. ఎలాంటి రాజకీయ సమావేశాలను నిర్వహించకూడదని వికాస్ రాజ్ వెల్లడించారు. సినిమాలు మరియు సోషల్ మీడియాలో ప్రచారం నిషేధించబడింది. టీవీ, రేడియో మరియు కేబుల్ నెట్‌వర్క్‌లలో ప్రకటనలు చేయడం నిషేధించబడింది. ఎన్నికల సంఘం అనుమతించిన ప్రకటనలను ప్రింట్ మీడియాలో ప్రచురించవచ్చని వికాస్ రాజ్ తెలిపారు.ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోకూడదని తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.ఐదుగురు మించి ఎక్కడైనా గుమికూడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయొద్దని ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గురువారం సాయంత్రం వరకు బార్లు, వైన్ షాపులు, పబ్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసామన్నారు.

తొలిసారిగా హోం ఓటింగ్ ..

తొలిసారిగా హోం ఓటింగ్ నిర్వహించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. నిర్ధేశించిన మార్గాల్లోనే ఎన్నికల సిబ్బంది ప్రయాణించాలని సూచించారు. ఓటర్లు ఎపిక్ కార్డులు ఆధారంగా చూపాలన్నారు. అవి లేకపోతే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించి ఓటేయవచ్చని తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ ను అనుమతించమని వెల్లడించారు.ఓటర్ స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.అక్టోబర్ 9న ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు,ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో లక్షా 40 వేల మంది సిబ్బంది ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు.నిర్దేశించిన రూట్లలోనే పోలింగ్ సిబ్బంది ప్రయాణించాలన్నారు.పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్‌కు అనుమతి లేదన్నారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందన్నారు.ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని ఇప్పటివరకు 27,178 మంది హోం ఓటింగ్ వినియోగించుకున్నారని తెలిపారు.

ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని వికాస్ రాజ్ చెప్పారు.తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించామన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లను భద్రతా సిబ్బంది తమ తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు.

 

Exit mobile version