Site icon Prime9

WhatsApp: వాట్సాప్ కొత్త అప్డేట్.. ఇకపై 32 మందితో..!

whatsapp 32 members video call feature

whatsapp 32 members video call feature

WhatsApp: వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. మరి ఆ ఫీచర్లేంటో చూసేద్దాం పదండి.

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎప్పటికప్పుడూ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వాటిలో ముఖ్యంగా వాట్సాప్ వీడియో కాల్ ఒకటి. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గ్రూప్ వీడియో కాల్ ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.  గ్రూప్ కాలింగ్ లో ఈ 32 మందికి సంబంధించిన కాల్ లింక్స్ ఈవారంలో ప్రారంభించనున్నట్టు “మెటా” సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. దీనితో యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీడియో కాల్ కోసం కాల్ లింక్ క్రియేట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీని కోసం వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.

ఇప్పటివరకూ వాట్సాప్ గ్రూపు వాయిస్ కాలింగ్ చేసేటప్పుడు 8 మందికి మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంది. కానీ, ఈ సరికొత్త అప్డేట్ ద్వారా వాట్సాప్ గ్రూపులో వాయిస్ కాలింగ్ ఏకంగా 32 మంది వరకు పాల్గొనేందుకు అనుమతించనుంది.

ఇదీ చదవండి: యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్..!

Exit mobile version