Gmail: జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. ఇకపై జీమెయిల్ వినియోగదారులంతా కొత్త జీమెయిల్ డిజైన్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గూగుల్ పేర్కొనింది. ఈనెల నుంచి గూగుల్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి వచ్చేస్తోంది. జీమెయిల్, గూగుల్ మీట్, గూగుల్ ఛాట్, స్పేసెస్ వంటి గూగుల్ అప్లికేషన్‌లను అన్ని ఒకే చోటకు తీసుకొస్తోంద గూగుల్. కొత్త జీమెయిల్ కోసం గూగుల్ ఇంటిగ్రేటెడ్ వ్యూను యూజర్లకు అందిస్తోంది.
ఈ నెల నుంచి యూజర్ ఇంటర్‌ఫేస్ జీమెయిల్ యొక్క ప్రామాణిక ఎక్స్ పీరియన్స్ మారుతుంది. దానితో గూగుల్ జీమెయిల్ కొత్త డిజైన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. Google ఇప్పటికీ పాత డిజైన్‌కి తిరిగి రావడానికి ఒక ఆప్షన్ ఇచ్చింది. అయితే త్వరలో, యూజర్లు జీమెయిల్ పాత డిజైన్‌కు తిరిగి మారే అవకాశం ఉండదు. కొత్త యూఐ(UI)తో యూజర్లు ఇప్పటికీ వారి జీమెయిల్ థీమ్, ఇన్‌బాక్స్ టైప్, మరికొన్ని ఆప్షన్లను మార్చుకోవచ్చు. క్విక్ సెట్టింగ్‌లను గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. కొత్త యూఐ జీమెయిల్ డిఫాల్ట్ డిజైన్‌గా మారడంతో.. విండోకు ఎడమ వైపున జీమెయిల్, గూగుల్ మీట్, గూగుల్ ఛాట్, స్పేసెస్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ వ్యూ చాట్‌ని ఆన్ చేసిన జీమెయిల్ యూజర్లకు కూడా ప్రామాణికంగా మారుతుంది.
క్విక్ సెట్టింగ్‌లు ఉన్నప్పటికీ సైడ్ ప్యానెల్‌ను ఆప్షన్ ని గూగుల్ అందిస్తుంది. క్విక్ యాక్సస్ కోసం యూజర్లు డిఫాల్ట్ యాప్‌లను తొలగించవచ్చు. ముఖ్యమైన యాప్‌లను యాడ్ చేయవచ్చు. కొత్త డిజైన్‌లో జీమెయిల్ ఎడమ వైపున చాట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. యూజర్లు ఇకపై జీమెయిల్ కుడి వైపున చాట్‌ని కాన్ఫిగర్ చేసే ఆప్షన్ ఉండదు.
ఇదీ చదవండి ట్విట్టర్ యూజర్లకు మరో షాక్.. వినియోగదారులంతా డబ్బు కట్టాల్సిందే..!