Virat Kohli: శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరీస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సీనియర్ల రాకతో టీ20 జట్టులో ఉండిన దీపక్ హుడా, హర్షల్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, ముఖేష్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్ పక్కకు తప్పుకోక తప్పలేదు.
సీనియర్ల రీ ఎంట్రీ
ఈ వన్డే సిరిస్ తో రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ పాటు విరాట్ కోహ్లి(Virat Kohli), కేఎల్ రాహుల్, శ్రేయర్ అయ్యర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లు వన్డేల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే సీనియర్ల పునరాగమనం సందర్భంగా ప్రముఖ స్ట్పోర్ట్స్ ఛానల్ “స్టార్ స్పోర్ట్స్ తెలుగు” కింగ్ ఆఫ్ ది రికార్డ్స్ విరాట్ కోహ్లిపై స్పెషల్ ట్వీట్ చేసింది.
కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పడు ఎక్కడ చూసినా ఆ సినిమా మానియా నడుస్తోంది. అదే మానియాతో స్టార్ స్పోర్ట్స్ కూడా వాల్తేరు వీరయ్య సినిమాలోని డైలాగ్ ను విరాట్ కోహ్లికి అన్వయించింది.’’ రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.. కింగ్ కోహ్లి(Virat Kohli) బ్యాక్ ఇన్ యాక్షన్” చూడండి అంటూ కోహ్లి ఫొటోతో సినిమా పోస్టర్ ను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో అటు విరాట్ ఫ్యాన్స్ తో పాటు.. ఇటు మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
“రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు,
నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి!” 😎🔥కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్!! 🤩
చూడండి 👀
Mastercard #INDvSL 1st ODI
జనవరి 10 | మ 12:30 PM నుండి
మీ 📺 #StarSportsTelugu & Disney+Hotstar లో#BelieveInBlue 💙#ViratKohli #WaltairVeerayya pic.twitter.com/GtcHuYJNRr— StarSportsTelugu (@StarSportsTel) January 9, 2023
అక్కడ హాఫ్ డే సెలవు
కాగా, జనవరి 10 న గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలి వన్డే ఆడనున్న భారత్ జనవరి 12న కోల్ కతాలో రెండో వన్డే, జనవరి15న తిరువనంతపురంలో మూడో వన్డే ఆడుతుంది. మొదటి వన్డే కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి.. మిగిలిన ప్లేయర్స్, శ్రీలంక జట్టు సభ్యులు గౌహతికి చేరుకున్నారు. సోమవారం జరిగే ప్రాక్టీస్ సెషన్ లో ఇరుజట్ల ఆటగాళ్లు పాల్గొంటారు. మరోవైపు గౌహతిలో మంగళవారం జరగనున్న మ్యాచ్ ను దృష్టిలో పెట్టకుని స్టేడియం ఉన్న కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో హాఫ్ డే సెలవు ప్రకటించింది అస్సాం గవర్నెంట్. దీంతో మధ్యాహ్నం నుంచి స్కూల్స్, గవర్నెంట్ ఆఫీసులు మూతపడనున్నాయి.
వన్డేలకు టీమిండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్
ఇవి కూడా చదవండి:
నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
టైమ్ పాస్ ప్రేమతో పిచ్చివాడనయ్యానంటూ.. బీటెక్ విద్యార్థి సూసైడ్ నోట్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/