Salaar: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ ట్వీట్ వైరల్.. (Salaar)
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే
The Most Violent Man is coming soon with the full package to blow your mind on Sep 28th, 2023.
Hello @RCBTweets, let’s unleash the Rebel mode this year 🔥#Salaar #Prabhas #PrashanthNeel #VijayKiragandur#RCBxHombale @hombalefilms pic.twitter.com/ueQT3qC2aH
— Salaar (@SalaarTheSaga) April 5, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు బట్టి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ అర్ధమవుతుంది.
తాజాగా సలార్ టీం ఆర్సీబీ క్రికెట్ టీంని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది.
దిమ్మతిరిగే యాక్షన్ తో సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
సలార్ చిత్రాన్ని కన్నడ నిర్మాతలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో తమ హోమ్ టీం ని సపోర్ట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
మరి ఇప్పటి వరకు కప్ కొట్టని ఆర్సీబీ ఈ ఏడాది అయిన టైటిల్ ని అందుకుంటుందా లేదా చూడాలి.
ఇక సలార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది.
జేమ్స్ బాండ్ సినిమా తెరకెక్కించిన లొకేషన్ లో ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
కాగా ప్రభాస్ నటించిన మరో చిత్రం ఆదిపురుష్ జూన్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. రామాయణం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు.