MI vs KKR: కోల్ కతాపై ముంబయి ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో రెండో ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 5 వికెట్లు కోల్పోయి మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ముంబయి బ్యాటింగ్ లో ఇషన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ రాణించారు.
మెుదట వెంకటేష్ అయ్యర్ సెంచరీతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. అయ్యర్ మినహా మిగతా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. చివర్లో రసెల్ రాణించాడు.
అయ్యర్ 51 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.