KKR vs SRH: సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హరీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మక్రామ్ 50 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 32 పరుగులతో రాణించాడు.
కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీయగా.. చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు.
సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హరీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మక్రామ్ 50 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 32 పరుగులతో రాణించాడు.
కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు తీయగా.. చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నాడు.
సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 18 ఓవర్లకే జట్టు స్కోర్ 200 చేరింది. హరీ బ్రూక్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 172 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో దుమ్ములేపుతుంది. 15 ఓవర్లకు 157 పరుగులు చేసింది. హరీ బ్రూక్ చెలరేగిపోతున్నాడు. 43 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
సన్ రైజర్స్ కెప్టెన్ మక్రామ్ విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 5సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.
12 ఓవర్లో 16 వచ్చాయి. యూషాష్ వేసిన బౌలింగ్ లో మక్రామ్ రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో మెుత్తం 16 పరుగులు వచ్చాయి.
హరీ బ్రూక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
10 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 94 పరుగులు చేసింది. యూషాష్ వేసిన బౌలింగ్ లో చివరి బంతికి మక్రామ్ సిక్స్ బాదాడు.
రస్సెల్ వేసిన ఏడో ఓవర్లో.. 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మక్రామ్ భారీ సిక్సర్ బాదాడు. సన్ రైజర్స్ 75 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హరీ బ్రూక్.. మక్రామ్ ఉన్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసింది.
సన్ రైజర్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. మెుదటి బంతికి అగర్వాల్ ఔటవ్వగా.. చివరి బంతికి త్రిపాఠి కూడా కీపర్ క్యాచ్ ఔటయ్యాడు.
సన్ రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. రస్సెల్ వేసిన బౌలింగ్ లో మెుదటి స్లిప్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అగర్వాల్ 13 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
సునీల్ నరైన్ వేసిన నాలుగో ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.
ఉమేష్ యాదవ్ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో బ్రూక్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. మూడు ఓవర్లకు సన్ రైజర్స్ 43 పరుగులు చేసింది.
ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో మరో 14 పరుగులు వచ్చాయి. ఇందులో వైడ్ రూపంలో ఐదు పరుగులు వచ్చాయి. హరీ బ్రూక్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
తొలి ఓవర్ వేసిన ఉమేష్ యాదవ్ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. హరీ బ్రూక్ మూడు ఫోర్లు కొట్టాడు.
క్రీజులోకి హరీ బ్రూక్.. మయాంక్ అగర్వాల్ వచ్చారు.
కోల్‌కతా: జాసన్ రాయ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్