KKR vs RCB: కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు.. తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా శార్ధుల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. 29 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రింకు సింగ్ కూడా బ్యాటింగ్ లో రాణించాడు. దీంతో నిర్ణిత ఓవర్లలో కోల్ కతా 204 పరుగులు చేసింది.
ఆర్సీబీ బౌలింగ్ లో డెవిడ్ విల్లీ, కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రాస్ వెల్, హర్షల్ పటెల్ తలో వికెట్ తీశారు.
కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు.. తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా శార్ధుల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. 29 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రింకు సింగ్ కూడా బ్యాటింగ్ లో రాణించాడు. దీంతో నిర్ణిత ఓవర్లలో కోల్ కతా 204 పరుగులు చేసింది.
కోల్ కతా ఆరో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్నా రింకు సింగ్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రింకు 33 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
శార్దుల్ ఠాకూర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 175 పరుగులు చేసింది.
శార్దుల్ ఠాకూర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 20 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి.
16ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 147 పరుగులు చేసింది. శార్దుల్ ఠాకూర్ జోరుమీదున్నాడు. 19 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ తో చెలరేగిపోతున్నాడు. వరుస సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. బ్రాస్ వెల్ బౌలింగ్ లో వరుస బంతుల్లో రెండు సిక్సులు కొట్టాడు. 15 ఓవర్లకు కోల్ కతా 140 పరుగులు చేసింది.
13 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా ఐదు వికెట్లకు 106 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రింకు సింగ్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.
కోల్ కతా స్టార్ బ్యాటర్ అండ్రూ రస్సెల్ డకౌట్ అయ్యాడు. దీంతో కోల్ కతా ఐదో వికెట్ కోల్పోయింది. కరణ్ శర్మ బౌలింగ్ లో రస్సెల్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
కోల్ కతా మూడో వికెట్ కోల్పోయింది. బ్రెస్ వెల్ బౌలింగ్ లో నితీష్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. నితీష్ రాణా ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి నైట్ రైడర్స్ 47 పరుగులు చేసింది.
ఐదు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి కోల్ కతా 41 పరుగులు చేసింది. ఐదో ఓవర్లో ఓ నో బాల్ పడింది. క్రీజులో నితీష్ రాణ్, గుర్భాజ్ కొనసాగుతున్నారు.
కోల్ కతా వరుసగా రెండో వికెట్ కోల్పోయింది. విల్లీ బౌలింగ్ లో వచ్చిరాగానే మన్ దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 26 పరుగుల వద్ద నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. రెండు బంతుల్లో రెండు వికెట్లు పడటంతో కోల్ కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో నితీష్ రాణా, గుర్బాజ్ ఉన్నారు.
కోల్ కతా తొలి వికెట్ కోల్పోయింది. విల్లీ బౌలింగ్ లో ఓపెనర్ వెంకటేష్ అయ్యార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 26 పరుగుల వద్ద నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది.
మూడో ఓవర్లో సిరాజ్ 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కోల్ కతా మూడు ఓవర్లకు 26 పరుగులు చేసింది.
రెండో ఓవర్లో కోల్ కతా కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఓవర్ ను విల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
తొలి ఓవర్ లో కోల్ కతా 9 పరుగులు చేసింది. తొలి ఓవర్ లో ఓ ఫోర్ తో పాటు.. వైడ్ రూపంలో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో వెంకటేష్ అయ్యార్, గుర్బాజ్ ఉన్నారు. తొలి ఓవర్ ను సిరాజ్ వేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్‌దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి