IPL 2023: ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారం నుంచి సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు సైతం దూరం అవనున్నారు. దీంతో ఆయా జట్ల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆటకు దూరమవుతున్న ఆ కీలక ఆటగాళ్లేవరో ఇపుడు చూద్దాం.
కీలక ఆటగాళ్లు వీరే.. (IPL 2023)
ఐపీఎల్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ మెగా ఈవెంట్ శుక్రవారం నుంచి సందడి చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ కు మాత్రం కొందరు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు సైతం దూరం అవనున్నారు. దీంతో ఆయా జట్ల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆటకు దూరమవుతున్న ఆ కీలక ఆటగాళ్లేవరో ఇపుడు చూద్దాం. తమ అభిమాన ఆటగాళ్ల ఆట కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశ తప్పేలా లేదు.
రిషబ్ పంత్: ఐపీఎల్ లో రిషబ్ పంత్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. గత సీజన్ లో దిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
దీంతో ఈ సీజన్ కు పంత్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి స్థానంలో డెవిడ్ వార్నర్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు.
కొన్ని మ్యాచ్ లకు పంత్ ను డగౌట్ లోకి తీసుకొస్తామని పాంటింగ్ తెలిపాడు.
బుమ్రా : టీమిండియా పేసర్.. బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరం అవ్వనున్నాడు. గత ఆరు నెలలుగా ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జోఫ్రా ఆర్చర్ రానున్నాడు.
శ్రేయస్ అయ్యర్: వెన్ను నొప్పి గాయం కారణంగా శ్రేయస్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో.. నితీష్ రాణాను తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
జానీ బెయిర్‌స్టో: బెయిర్‌స్టో కాలికి సర్జరీ కారణంగా సీజన్ కు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో మాథ్యూ షార్ట్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంది.
ప్రసిధ్ కృష్ణ : వెన్ను నొప్పి కారణంగా.. పేసర్ ప్రసిద్ కృష్ణ జట్టుకు దూరమవుతున్నాడు. అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది.
రజత్ పటిదార్: గతేడాది అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. మడమ గాయం కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.
ముఖేశ్ చౌదరి : చెన్నై యువ పేసర్ ముఖేశ్ చౌదరి.. ఈ సీజన్‌కు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అతడు త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు.
జోష్ హేజిల్‌వుడ్ : గాయం కారణంగా ఈ సీజన్ తొలి అర్ధభాగానికి దూరం అవుతున్నాడు.
కైల్ జేమీసన్ : జేమీసన్.. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇతడి స్థానంలో స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసిందాతో ఒప్పందం చేసుకుంది.
గ్లెన్ మాక్స్‌వెల్: మోకాలి గాయం కారణంగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.