Site icon Prime9

IPL 2023 RCB vs PBKS: సిరాజ్ బంతాట.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం

IPL 2023 RCB vs PBKS:  24 పరుగుల తేడాతో పంజాబ్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కి సిరాజ్ రూపంలో చుక్కెదురయ్యింది. సిరాజ్ బంతుల ధాటికి పంజాబ్ కింగ్స్ కుప్పకూలిపోయారు.  175 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ జట్టు 18.2 ఓవ‌ర్ల‌లో కేవలం 150 ప‌రుగుల‌ మాత్రమే చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 46, జితేశ్ శ‌ర్మ‌ 41 పరుగులతో రాణించ‌గా మిగిలిన వారు వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా, హ‌స‌రంగా రెండు వికెట్లు, పార్నెల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసింది. డుప్లెసిస్డుప్లెసిస్(84), విరాట్ కోహ్లీ(59)పరుగుల వర్షం కురిపించారు. చెరో హాఫ్ సెంచరీ తమ ఖాతాలో వేసుకున్నారు. దినేశ్ కార్తిక్‌(7), మాక్స్‌వెల్(0)లు అంతగా రాణించలేకపోయారు. ఇక పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయ‌గా నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

 

Exit mobile version