CSK vs PBKS: ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని ఎంతో ఉత్కంఠతతో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడా పంజాబ్ విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆఖరి బంతికి రజా, షారుక్ ధ్వయం కలిసి మూడు రన్స్ చేయడంతో పంజాబ్ విజయం ఖాయం అయ్యింది.
ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేసింది. దానితో పంజాబ్ టార్గెట్ 201గా ఉంది. లాస్ట్ ఓవర్లో బరిలోకి దిగిన ధోని లాస్ట్ రెండు బంతులను సిక్స్ లు గా మలచి టీం స్కోర్ ను 200 గా సెట్ చేశాడు. ఇక కాన్వే చక్కటి ఫినిషింగ్ తో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.