Site icon Prime9

IPL: ఐపీఎల్ లో ఫుట్ బాల్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం

bcci-introduces-impact-player-concept-in-ipl-from-next-season

bcci-introduces-impact-player-concept-in-ipl-from-next-season

IPL: ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ ‘సబ్ స్టిట్యూట్’ విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా క్రికెట్లో ‘సబ్ స్టిట్యూట్’ అంటే, ఎవరైనా గాయపడితే వారి బదులు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్ తో సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నారు ఇండియన్ క్రికెట్ బోర్డ్. ఐపీఎల్ లో ‘సబ్ స్టిట్యూట్’ తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించుకోవచ్చు.

ఈ సబ్ స్టిట్యూట్ ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని పిలుస్తారు. టాస్ సమయంలో ఒక్కో జట్టు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కోటాలో నలుగురి పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో ఆ నలుగురిలో ఒకరిని ‘సబ్ స్టిట్యూట్’ గా బరిలో దింపి బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయించుకోవచ్చు. అయితే ఏ ఇన్నింగ్స్ లో అయినా 14వ ఓవర్ ముగియడానికి ముందే ఈ ‘సబ్ స్టిట్యూట్’ ను బరిలో దింపాల్సి ఉంటుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఫుట్ బాల్ లో ఈ ‘సబ్ స్టిట్యూట్’ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లోనూ ‘సబ్ స్టిట్యూట్’ నిబంధన మ్యాచ్ స్వరూపాన్ని మార్చేదిగా ఉంటుంది బీసీసీఐ భావిస్తోంది. ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ విధానాన్ని బీసీసీఐ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి: సీఎస్కే ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌కు డ్వేన్ బ్రావో గుడ్ బై

Exit mobile version