Site icon Prime9

Ipl 2023 Chennai vs LSG: టాస్ నెగ్గిన లక్నో.. ధోని నినాదంతో మార్మోగుతున్న చెపాక్

Ipl 2023 Chennai vs LSG

Ipl 2023 Chennai vs LSG

Ipl 2023 Chennai vs LSG: ఐపీఎల్‌ 2023 భాగంగా లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు టోర్నీలో ఒక్కో మ్యాచ్‌ ఆడాయి. లక్నోతన తొలి విజయాన్ని అందుకోగా.. చెన్నై మొదటి మ్యాచ్ ఓటమి పాలైంది. అయితే చెపాక్ వేదికగా లక్నో అదే జోరు కొనసాగిస్తుందా? మరీ ఈ మ్యాచ్ తో నైనా ధోని సేన పుంజుకుంటుందా? అనేది వేచి చూడాలి.

ఒక్క మార్పుతో లక్నో..(Ipl 2023 Chennai vs LSG)

కాగా, ఈ మ్యాచ్ లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్ లో దారుణంగా విఫలమైన జయదేవ్ ఉనద్కట్ స్థానంలో రవిసింగ్ ఠాగూర్ తుదిజట్టులోకి వచ్చాడు. మరో వైపు సీఎస్కే మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా రెండో మ్యాచ్ ఆడనుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత చెపాక్ లో చెన్నై తొలి మ్యాయ్ ఆడనుంబటం విశేషం. దీంతో ధోని నామ జపంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతోంది.

 

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, రాజవర్ధన్ హంగర్గేకర్, దీపక్ చాహర్

లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, లోకేష్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, , ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, యశ్ రవిసింగ్ ఠాకూర్, రవి బిష్ణోయ్

Exit mobile version