సన్ రైజర్స్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మినహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. శర్మ.. 26 బంతుల్లో 34 పరుగులు చేశాడు. బ్రూక్, మాక్రమ్, మయాంక్ ఘోరంగా విఫలం అయ్యారు.
చెన్నై బౌలర్లలో.. జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. పతిరణ, తీక్షణ, ఆకాష్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
సన్ రైజర్స్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మినహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించలేదు. శర్మ.. 26 బంతుల్లో 34 పరుగులు చేశాడు. బ్రూక్, మాక్రమ్, మయాంక్ ఘోరంగా విఫలం అయ్యారు.
చెన్నై బౌలర్లలో.. జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. పతిరణ, తీక్షణ, ఆకాష్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
సన్ రైజర్స్ తడబడుతోంది. పరుగులు చేసేందుకు బ్యాటర్లు కష్టపడుతున్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి 114 పరుగులు చేసింది సన్ రైజర్స్.
సన్ రైజర్స్ వరుస వికెట్లు కోల్పోతుంది. 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో మయాంక్ స్టంపౌట్ అయ్యాడు.
సన్ రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ మక్రామ్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. మక్రామ్ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
13 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 91 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 84 పరుగుల వద్ద.. రాహుల్ త్రిపాఠి క్యాచ్ ఔటయ్యాడు. త్రిపాఠి 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
8 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో త్రిపాఠి, అభిషేక్ ఉన్నారు.
మెుయిన్ అలీ వేసిన ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో తొలి బంతికే.. త్రిపాఠి సిక్సర్ కొట్టాడు.
పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ 45 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్, త్రిపాఠి ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాష్ సింగ్ బౌలింగ్ లో బ్రూక్ క్యాచ్ ఔటయ్యాడు. బ్రూక్ 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు.
నాలుగో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఇందులో వరుసగా రెండు ఫోర్లు వచ్చాయి.
ఆశాష్ సింగ్ వేసిన మూడో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో అభిషేక్ ఓ సిక్సర్ కొట్టాడు.
ఆకాష్ సింగ్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. చివరి బంతికి బ్రూక్ ఫోర్ సాధించాడు.
మ్యాచ్ ప్రారంభం. క్రీజులోకి బ్రూక్, అభిషేక్. తొలి ఓవర్ ఆకాశ్ సింగ్ వేస్తున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్