Virat Kohli: విరాట్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. టీ20ల్లో అగ్రస్థానం

పరుగులు మెషీన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Virat Kohli: పరుగులు మెషీన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

టీ20 ప్రపంచ క‌ప్‌లో అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న కోహ్లీ 4000 పరుగుల మైలురాయి దాటాడు. ఇటీవల అక్టోబర్‌ నెలకు గాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డును సొంతం చేసుకున్న ఈ రన్‌ మెషీన్‌‌.. తాజాగా టీ20ల్లో 4008 ప‌రుగులు చేసిన మొద‌టి క్రికెట‌ర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇంగ్లాడ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ పోరులో విరాట్‌ ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులతో ఈ పొట్టి ఫార్మాట్‌లో విరాట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఇందులో ఒక సెంచరీ, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3,853 పరుగులతో రెండో స్థానం ఉండగా, న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గుప్తిల్‌ 3,531, పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ 3,323 రన్స్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఇకపోతే ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అత్యధిక పరుగులు చేసింది కూడా విరాట్ కోహ్లీనే. శ్రీలంక మాజీ కెప్టెన్‌ జయవర్దనే(1,016)ను వెనక్కి నెట్టి 1,141 పరుగులతో విరాట్ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలోనూ అత్యధిక పరుగుల రికార్డు విరాట్‌దేనని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: చితక్కొట్టేశారు భయ్యా.. సెమీస్ లో టీమిండియాకు ఘోర పరాభవం