Jasprit Bumrah: ఏ ఆటైనా సరే ఒక ఆటగాడికి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. తన ప్రతిభ కనపరచడం ద్వారానే జాతీయ జట్టులో ఆడడానికి అర్హత లభిస్తుంది. కొంత గ్యాప్ వచ్చినా వారు ఆ ఆటల్లో అంతగా రాణించలేరు. ఆట ఆడటానికి ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యమని నిరూపిస్తున్నాడు టీమిండియా ఆటగాడు బుమ్రా. గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్-2022 కు బుమ్రా దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
జస్ప్రీత్ బుమ్రా టీమిండియా క్రికెట్ జట్టులో ఓ గొప్ప ఆటగాడు. ప్రముఖ బౌలర్లలో ఒకడు. తన వైవిద్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించగల బౌలర్ గా అతడికి మంచి గుర్తింపు ఉంది. ఇక డెత్ ఓవర్లలో అయితే అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే బుమ్రాను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అంటారు. గాయం కారణంగా జట్టుకు దూరమయిన అతడు కాస్త కోలుకుని తిరిగి జట్టులోకి పునరాగమనం చేసేందుకు కసరత్తులు ప్రారంభించాడు. పిట్ నెస్ సాధించేందుకు కఠినమైన శిక్షణ తీసుకుంటూ క్రికెట్ అభిమానులను నెట్టింట పలకరించాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ శిబిరంలో ఉన్న బుమ్రా మైదానంలో రన్నింగ్, వ్యాయామం లాంటి ప్రాక్టీస్ లను చేస్తూ ఆ వీడియో తనూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అంత ఈజీగా కాదు కానీ ఎల్లప్పుడూ విలువైనదే అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు.
Never easy, but always worth it 💪 pic.twitter.com/aJhz7jCsxQ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2022
ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రికెట్ కు దినేష్ కార్తిక్ గుడ్ బై.. వీడియో వైరల్