Site icon Prime9

YS Sharmila: తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్ఆర్‌టిపి.. 119 సీట్లకు పోటీ చేస్తామన్న వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila: కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ బెడిసి కొట్టడంతో వైఎస్ షర్మిల రూటు మార్చారు. తన సొంత పార్టీ వైఎస్ఆర్‌టిపి తరపునే తెలంగాణ ఎన్నికల్లో తలపడాలని వైఎస్ షర్మిల డిసైడయ్యారు. గురువారం నిర్వహించిన వైఎస్ఆర్‌టిపి కార్యవర్గ సమావేశంలో ఎన్నికల కార్యచరణపై నేతలు, క్యాడర్‌తో షర్మిల చర్చించారు. సమావేశంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్‌టిపి నిర్ణయించింది.

పాలేరు నుంచి పోటీ చేస్తాను..(YS Sharmila)

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ 119 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చని వైఎస్ షర్మిల ప్రకటించారు. తాను పాలేరునుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పారు. విజయలక్ష్మి, అనిల్ పోటీ చేయాలని డిమాండ్ ఉంది.అవసరమైతే విజయలక్ష్మి పోటీ చేస్తారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనుకున్నాము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుందనుకున్నామని వైఎస్ షర్మిల చెప్పారు. ఓట్లు చీలిస్తే కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అంచనా వేశాము. అందుకే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపాము. నాలుగు నెలలు ఎదురు చూసినా అనుకున్న ఫలితం రాలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకువస్తామని షర్మిల చెప్పారు.

 

Exit mobile version