Site icon Prime9

Nara Lokesh: వైసిపి రాజకీయ యాత్ర తుస్.. నారా లోకేష్

YCP's political campaign has failed ...Lokesh

YCP's political campaign has failed ...Lokesh

Visakha Garjana: వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన వైసీపి రాజకీయ యాత్ర తుస్ మందన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు.

విమానాశ్రయం ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడిది చేసిన హోటల్ గదులను సోదాలు చేయడం సరికాదన్నారు. అక్కడవున్న నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన దుడుసు చర్యలను ఖండిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. వైకాపా నేతలు తమ యాత్రలో చోటు చేసుకొన్న విఫల ఉక్రోషాన్ని జనసేన పార్టీ పైన చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీల పై ఇలాంటి చర్యలు తీసుకోవడం వైకాపాకే చెల్లిందన్నారు. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం నేతలకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన్నట్లుగా పోలీసులు ప్రవర్తించడాన్ని లోకేష్ తప్పుబట్టారు.

ఇది కూడా చదవండి: Janasena: రాళ్ల దాడి కేసు.. జనసేన నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

Exit mobile version