Site icon Prime9

Pawan Kalyan: జనసేన ఏం చేయాలో వైసీసీ డిసైడ్ చేస్తుందా.. పవన్ కళ్యాణ్

pawan-kalyan tour to ippatam village in guntur

pawan-kalyan tour to ippatam village in guntur

Vishakhapatnam: జనసేన కార్యక్రమం ఎలా నిర్వహించాలో వైసీపీ నిర్దేశిస్తుందా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా అంటూ జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం ర్యాలీలో పోలీసులు జులుం చూపించారని, తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మా తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అందుకే పోలీసులు అంటే నాకు గౌరవం. నిన్న ఓ పోలీస్ అధికారి వాహనం ఎక్కి అభివాదం వద్దంటున్నారు. అది చాలా బాధ అనిపించింది. నిన్న వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాసారు. మీ మీద నమ్మకం లేదన్న నాయకుడు ఈ రోజు సీఎం. మీరు అంత పవర్ పుల్ అయితే వివేకానంద హత్య కేసును ఎందుకు చేధించలేకపోయారు, ఎందుకు నిందితులును అరెస్టు చెయ్యలేదని పవన్ ప్రశ్నించారు.

ప్రజా సమస్యలు అధికార పార్టీ తీరిస్తే మా దగ్గరకు ఎందుకు వస్తారు. జన వాణికి ఇప్పటి వరకు మూడు వేలు పిటిష్లను వచ్చాయి. ర్యాలీలో పోలీసులు జులం చూపించారు. నన్ను అరెస్ట్ చేయడాని ప్రయత్నం చేశారు. సంఘవిద్రోహ శక్తిని కాదు నేను, గంజాయి అక్రమ రవాణా చేసిన వారిని వదిలేస్తున్నారు. వికేంద్రీకరణ అన్నది ప్రభుత్వ వాదన. 2014 లో మీరు ఏది రాజధాని అంటే ఎప్పుడు అదే రాజధాని. ఉత్తరాంధ్ర పై ప్రభుత్వానికి ఇప్పడే ప్రేమ పుట్టిందా, 2014లోనే రాజధాని విశాఖ, కర్నూలు, అమరావతి అని ఎందుకు చెప్పలేదు? అప్పుడు చేపితే మేము అదే రాజధాని అని చేప్పే వాళ్ళం. గంజాయి వ్యాపారం చేసే వారిని, దోపీడీలు చేసేవారిని వదలేస్తారు. ప్రజలు సమస్యలు గొంతేత్తే గొంతు నొక్కుతున్నారని పవన్ మండిపడ్డారు.

రాయలసీమ నుండి సీఎంలుగా ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేసారు. మరి అభివృద్ధి ఎందుకు చెయ్యలేదు. ఉత్తరాంధ్ర నుండి అనేక నాయకులు ఉన్నారు మరి ఏంచేసారు. ఒక వ్యక్తి తీసుకున్నా నిర్ణయం వల్ల అనేక పరిశ్రమలు వెళ్లపోయాయి. ఒక్క వ్యక్తి చేతుల్లో అధికారం ఉంచుకోని మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా. కోడికత్తి వాళ్ళే పొడిపించుకోని వాళ్ళే పరిష్కారం చేసుకున్నారు. వారికి గొడవ కావాలి అందుకు వారే ప్లాన్ చేసుకున్నారు. అందుకు పోలీసులు సెక్యూరిటీ లేదు. ధర్మాన 70 ఎకరాలు సైనికుల భూములు దోచుకున్నారని చెబుతున్నారు. సైనికులు భూమికి రక్షణ లేకపోతే ఎలా, దమ్ముంటే ఆ భూములు రిలీజ్ చెయ్యండి అంటూ పవన్ కళ్యాణ్ సవాల్ చేసారు.

Exit mobile version