Site icon Prime9

Bandi Sanjay: టీఆర్ఎస్ నేతలు పీఎఫ్‌ఐకు ఆర్థిక సాయం చేస్తున్నారు.. బండి సంజయ్

Bndi sanjay

Bndi sanjay

Hyderabad: సీఎం కేసిఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కావాలనే మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేదిత ఫిఎఫ్ఐ సంస్థను కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు పీఎఫ్‌ఐకు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు.

2047 నాటికి తెలంగాణను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చడానికి పీఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎమ్ఐఎమ్‌తో కలిసి పీఎఫ్‌ఐను విస్తరిస్తారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఉద్యమించకపోతే ఎంఐఎం ఆగడాలను అడ్డుకునే పార్టీ ఉండదన్నారు. పీఎఫ్‌ఐ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎంలను తరిమికొట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

బుధవారం ఉదయం నాగోల్‌ నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. నాగోల్ నుంచి కొత్తపేట కన్యకా పరమేశ్వరీ టెంపుల్, బాబా కాంప్లెక్స్, చైతన్యపురి, పీ అండ్ టీ కాలనీ, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం, కర్మాన్‌ఘాట్ క్రాస్ రోడ్స్, బైరామల్ గూడా క్రాస్ రోడ్స్, వెంకటరమణ కాలనీ, టీవీ కాలనీ బస్సు స్టాప్, ఎన్జీవోస్ కాలనీ వాటర్ ట్యాంక్, వనస్థలిపురం షాపింగ్ కాంప్లెక్స్, హుడా సాయి నగర్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

Exit mobile version