Site icon Prime9

Rahul Gandhi: ప్రజల భాష, సంస్కృతి పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయి.. రాహుల్ గాంధీ

Rahul-Gandhi-at Bharat-Jodo-Yatra

Kanyakumari: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించారు. రాహుల్‌కు సీఎం స్టాలిన్, గెహ్లాట్ త్రివర్ణ పతాకాన్ని అందించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ ప్రజల భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు. మత చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తోంది. రాజ్యాంగ సంస్థలను మోదీ భ్రష్టుపట్టిస్తున్నారు. సీబీఐ, ఈడీలను ప్రతిపక్షాల పై అస్త్రాలుగా వాడుతున్నారు. అయితే ఇలాంటి దాడులకు మేము భయపడమని అన్నారు.

తమిళనాడుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. తమిళనాడులో పర్యటించడం నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇది చారిత్రక యాత్ర. లక్షలాది మంది కార్యకర్తల కోరిక మేరకే యాత్ర జరుగుతుందని రాహుల్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఏదో లోటుందని ప్రజలు భావిస్తున్నారు. జాతీయ జెండా అంటే కేవలం మూడు రంగులు కాదు. అన్ని రాష్ట్రాల సమైక్యతకు జాతీయ జెండా చిహ్నం. ప్రతీ భారతీయుడి స్వేచ్ఛకు ఇది ప్రతీకని రాహుల్ గాంధీ అన్నారు.

మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలల్లో భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ సుమారు 3,570 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నారు. దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, ద్రోవ్యోల్పణ, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతోనే భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాను రాహుల్ గాంధీ ఎండగడతారని తెలిపింది.రాహుల్ వెంట 118 మంది కాంగ్రెస్ నేతలు యాత్రలో పాల్గొంటున్నారు.

Exit mobile version