Munugode: మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల కష్టాలను అసెంబ్లీ వేదికగా కొట్లాడకుండా, రాజీనామ చేసి తిరిగి ఎన్నికకు కారకుడైన కోమటిరెడ్డి తిరిగి ఏం పొడుస్తాడని రేవంత్ దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో ఆయన ప్రచారంలో భాగంగా అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సమక్షంలో మాట్లాడారు.
డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం కాని, దళితుల మూడెకరాల భూమి కోసం కాని, 12శాతం గిరిజనుల రిజర్వేషన్ కోసం, ఇంటికో ఉద్యోగం, అన్నదాతలకు లక్ష రూపాయల రుణమాఫీ, తదితర సమస్యల పై కోట్లాడకుండా ఎందుకు రాజీనామా చేశావో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ జెండాలను తగలబెట్టడం కాదు. ఏ చౌరస్తాకు వస్తారో చెప్పండి. నా కార్యకర్తలతో వచ్చి వ్యవహారం తేల్చుకుంటామంటూ తెరాస, భాజపాలపై ఆయన విరుచుకపడ్డారు.
4 సంవత్సరాల పాటు కేసిఆర్ మంత్రి వర్గంలో మహిళా మంత్రి లేదన్న సంగతిని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం వచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఒక దశలో మీ పాల్వాయి గోవర్ధన రెడ్డి కూతురు స్రవంతి అంటూ వ్యాఖ్యానించారు. చివరగా హస్తం గుర్తుకే మీ ఓటు అన్న సమయంలో మీటింగ్ కు వచ్చిన ప్రజలు పెద్ద యెత్తున చప్పట్లతో హర్షధ్వానాలు చేసి రేవంత్ కు మద్ధతు పలికారు.
ఇది కూడా చదవండి: కాంట్రాక్టర్ బలుపు వల్లే మునుగోడులో బైపోల్.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు