Site icon Prime9

Renuka Chaudhary: కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే నేను కార్పొరేటర్ ని.. రేణుకా చౌదరి

Rnuka chowadary

Rnuka chowadary

Renuka Chowdary on Kodali Nani: తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలోని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి ఎోటీ చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఖమ్మంలో కార్పొరేటర్​గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. అయితే, కొడాలి కామెంట్ పై రేణుక కూడా అంతే ఘాటుగా స్పందించారు.

కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అని రేణుకా చౌదరి అన్నారు. బుజ్జీ నీకు చరిత్ర తెలియదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్ కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చాడు. ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చిందని రేణుకా చౌదరి అన్నారు.

నేను టీడీపీకి మద్దతుగా లేను. ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడుతూ నాకు మంచి ఐడియా ఇచ్చాడు. నేను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తా. నేను మున్సిపల్ కార్పొరేటర్ గా చేశా. ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేశా. ఎమ్మెల్యేగా ఎప్పుడూ చేయలేదు. గుడివాడలో పోటీ చేస్తే, నేనే గెలుస్తా. కొడాలి నానిని ఎవరూ మళ్లీ ఎన్నుకోరు. ఎక్కడ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తా అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మాజీ ఎంపీ రేణుకా చౌదరి సపోర్ట్​ చేస్తున్నారు. దీంతో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు.

 

Exit mobile version